మాదకద్రవ్య వ్యసనం నుండి బయటపడిన వారు పోరాట యోధులని ప్రధాని మోదీ అన్నారు. యువతను డ్రగ్స్ పట్ల అప్రమత్తం చేయాలని ఆయన కోరారు.

'నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభ్యాన్' ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ వల్ల కలిగే ఆనందం తాత్కాలికమని, అది జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు.