ప్రధాని మోదీ వీడియోను తొలగించిన వ్యవహారంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బెర్గ్ పై పార్లమెంటరీ ప్యానెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రధాని మోదీకి సంబంధించిన వీడియోను తొలగించిన అంశంపై మెటా ప్రతినిధులు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసి వివరణ ఇచ్చారు. అయితే, ఈ విషయంలో మార్క్ జుకర్‌బెర్గ్ కు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం ఇచ్చింది. 3 రోజుల్లోగా అధికారికంగా క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

అల్గారిథమ్ వల్ల ఇలా జరిగిందని చెప్పే సాకు ఇక్కడ పని చేయదని ప్యానెల్ తేల్చి చెప్పింది. మెటా ఈ విషయంపై పూర్తి పారదర్శకతతో సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మెటా ప్రతినిధులు సుమారు 45 నిమిషాల పాటు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ప్యానెల్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంది.