అమెరికా రాజకీయాల్లో దశాబ్దాల క్రితం ఉన్నంతగా ప్రో-ఇజ్రాయెల్ లాబీయింగ్ గ్రూపుల ప్రభావం ఇప్పుడు లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా రాజకీయాల్లో ఇజ్రాయెల్ మద్దతు గ్రూపుల ప్రాబల్యం క్షీణిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 20-25 ఏళ్ల క్రితం వాషింగ్టన్‌లో ఈ గ్రూపులకు ఉన్నంత శక్తి ఇప్పుడు లేదని, ముఖ్యంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్స్‌లో డెమొక్రాట్ల వైఖరిని చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు.

సెనెట్ మైనారిటీ లీడర్ చక్ షూమర్‌ను కూడా ట్రంప్ విమర్శించారు. షూమర్ ఇప్పుడు 'నిజానికి ఒక పాలస్తీనియన్ లాగా మారిపోయారు' అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికా రాజకీయాల్లో ఇజ్రాయెల్‌పై మద్దతు తగ్గుతున్నట్లు ఇటీవలి సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి.