పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు నిలిచిపోవడంతో రాజస్థాన్ అటవీ మంత్రి సంజయ్ శర్మ తన సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆయన నిరసన ప్రారంభించిన 4 గంటల్లోనే 5 మంది కార్మికులకు నియామక పత్రాలు అందాయి.
రాజస్థాన్‌లోని అల్వర్‌లో 69 మంది పారిశుద్ధ్య కార్మికుల నియామకం నిలిచిపోవడంతో అటవీ మంత్రి సంజయ్ శర్మ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్లపై ఆయన అవినీతి ఆరోపణలు చేశారు.
మంత్రి చేపట్టిన ఈ నిరసన ప్రభావంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ధర్నా ప్రారంభించిన కేవలం 4 గంటల వ్యవధిలోనే 5 మంది పారిశుద్ధ్య కార్మికులకు నియామక పత్రాలను అందజేశారు అధికారులు.