కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందే మాతరం పాడేటప్పుడు సోనియా గాంధి అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందే మాతరం ఆలపించారు. అయితే, వందే మాతరం పాటను మధ్యలో ఆపాలని సోనియా గాంధి ఆదేశించారని బీజేపీ ప్రతినిధి ఆర్.పి. సింగ్ ఆరోపించారు. సోనియా గాంధికి వందే మాతరం అంటే ఎందుకు అంత ద్వేషం అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ స్పందిస్తూ, వందే మాతరం విషయంలో ఎలాంటి వివాదం లేదని తేల్చి చెప్పారు. 1937లో రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు కాంగ్రెస్ సదస్సుల్లో వందే మాతరం పాడాలని నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. పవన్ ఖేడా మరియు అశోక్ గెహ్లాట్ కూడా ఈ కార్యక్రమంలో ఎలాంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు.