విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మకు హైదరాబాద్ భక్తులు సాంప్రదాయ స్వర్ణ బోనాన్ని సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు విఐపి దర్శనాన్ని నిలిపివేసి, భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆషాడ మాస వేడుకల సందర్భంగా ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తుల తరపున సాంప్రదాయ స్వర్ణ బోనాన్ని సమర్పించారు. గత 16 ఏళ్లుగా భక్తితో కొనసాగుతున్న ఈ సాంప్రదాయం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది.
భక్తుల భారీ రాకను దృష్టిలో ఉంచుకుని, దేవస్థాన అధికారులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విఐపి దర్శనాన్ని నిలిపివేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారి వి.కె. సీన నాయక్ తెలిపారు.