2021లో రియల్ మాడ్రిడ్ నుండి నిష్క్రమించిన తర్వాత జినెడైన్ జిదాన్ మొదటిసారి కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. డిడియర్ డెచాంప్స్ స్థానంలో ఫ్రాన్స్ జట్టుకు ఆయన కొత్త కోచ్‌గా నియమించబడ్డారు.
జినెడైన్ జిదాన్ ఫ్రాన్స్ జాతీయ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా నియమించబడ్డారు. పారిస్‌లోని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయంలో ఫెడరేషన్ అధ్యక్షుడు ఫిలిప్ డయల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జిదాన్ నాలుగు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
జిదాన్ మాట్లాడుతూ, ఈ అవకాశం కోసం తాను ఐదేళ్లపాటు వేచి చూశానని, ఇది తన కెరీర్‌లోనే అత్యంత సంతోషకరమైన రోజు అని ఎమోషనల్‌గా చెప్పారు. క్లబ్ బృందాల నుండి వచ్చిన ఆఫర్లను తిరస్కరించి, కేవలం ఫ్రాన్స్ జట్టు బాధ్యత తీసుకోవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని జిదాన్ తెలిపారు. సెప్టెంబర్ 25న టర్కీతో జరిగే నేషన్స్ లీగ్ మ్యాచ్ ద్వారా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.