2026 ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌కు ముందు భారత హాకీ జట్టు జెర్సీ వివాదంలో చిక్కుకుంది. దశాబ్దాలుగా ఉన్న సాంప్రదాయ నీలి రంగు జెర్సీ స్థానంలో కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపై మాజీ కెప్టెన్ వీరెన్ రస్కిన్హా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2026 ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌కు ముందు భారత హాకీ జట్టు కొత్త జెర్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. దశాబ్దాలుగా టీమిండియా నీలి రంగు జెర్సీని ధరిస్తుండగా, హాకీ ఇండియా ఇప్పుడు కాషాయ (నారింజ) రంగు జెర్సీని ప్రధాన కిట్‌గా పరిచయం చేసింది. ఈ నిర్ణయంపై భారత హాకీ దిగ్గజం, మాజీ కెప్టెన్ వీరెన్ రస్కిన్హా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. భారత జట్టు గుర్తింపు ఎప్పుడూ నీలి రంగులోనే ఉంటుందని, దానిని మార్చడం వెనుక ఉన్న తర్కం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
తాను ఎన్నో ఏళ్లుగా నీలి రంగు జెర్సీని గర్వంగా ధరించానని, అభిమానులు కూడా భారత జట్టును అదే రంగులో చూడాలని కోరుకుంటున్నారని రస్కిన్హా పేర్కొన్నారు. మరోవైపు, ఈ వివాదం నడుస్తుండగానే బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరగనున్న ప్రపంచకప్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న టీమిండియా, దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.