టీ20 క్రికెట్ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టిస్తున్న భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. క్రిస్ గేల్ రికార్డులను సైతం మించిపోతున్నాడు.
టీ20 క్రికెట్‌లో 'యూనివర్సల్ బాస్'గా పేరుగాంచిన క్రిస్ గేల్ రికార్డులను ఒక టీనేజర్ సవాలు చేయడం విశేషం. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌తో మైదానంలో విధ్వంసం సృష్టిస్తున్నాడు.
వైభవ్ తన తొలి 40 టీ20 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 1670 పరుగులు సాధించాడు. ఇందులో 132 ఫోర్లు, 168 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో క్రిస్ గేల్ తన మొదటి 40 ఇన్నింగ్స్‌లలో 1189 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వైభవ్ 216.32 స్ట్రైక్ రేట్‌తో ఆడుతుండగా, గేల్ స్ట్రైక్ రేట్ 137.29గా ఉంది. వైభవ్ ఈ ప్రయాణంలో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.