భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమిని కొనుగోలు చేయడానికి సహాయం చేయాలని సీఎం పుష్కర్ సింగ్ ధామిని కోరారు. దీనికి స్పందించిన సీఎం, నిబంధనల ప్రకారం అన్ని సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ తన నివాసాన్ని ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌కు మార్చుకోవాలని భావిస్తున్నారు. అయితే, గత మూడేళ్లుగా తగిన స్థలం దొరకడం లేదని ఆయన ఎక్స్ (X) వేదికగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి విన్నవించుకున్నారు.
తాను భూమిని ఉచితంగా ఆశించడం లేదని, ప్రభుత్వ ధరలకే కొనుగోలు చేయాలనుకుంటున్నానని పంత్ స్పష్టం చేశారు. పంత్‌ను ఉత్తరాఖండ్‌కు గర్వకారణంగా అభివర్ణించిన సీఎం ధామి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మరియు వారు త్వరలోనే పంత్‌ను సంప్రదిస్తారని తెలిపారు.