మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వోన్ కుమారుడు ఆర్చీ వోన్ సరే జట్టుపై అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు. అతను 52 పరుగులు చేయడమే కాకుండా 3 వికెట్లు కూడా తీశాడు.

సరే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆర్చీ వోన్ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో సమ్మర్సెట్ భారీ విజయానికి కారణమయ్యాడు. 20 ఏళ్ల ఆర్చీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కేవలం 36 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు మరియు మూడు సిక్సర్లు కొట్టి ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా ఆర్చీ తన పట్టును చాటుకున్నాడు. అతను 9 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఆర్చీ మరియు జాక్ లీచ్ల బౌలింగ్ వేటలో సరే బ్యాటర్లు నిలవలేకపోయారు. దీంతో సరే జట్టు 180 పరుగులకే ఆలౌట్ కాగా, సమ్మర్సెట్ 188 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.