హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల చెస్ prodigy దీక్షిత, కేవలం ఒక నెలలోనే తన ఎలో రేటింగ్‌ను 1985 నుండి 2469.8కి పెంచుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
హైదరాబాద్‌కు చెందిన మోడిపల్లి దీక్షిత చెస్ ప్రపంచంలో అసాధారణమైన ఎదుగుదలను కనబరిచింది. యూరోపియన్ టూర్ సందర్భంగా నాలుగు టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించి, కేవలం 30 రోజుల్లోనే దాదాపు 29,200 ర్యాంకుల దూకింది. ఆమె రేటింగ్ ప్రస్తుతం 2469.8కి చేరుకోవడంతో ప్రపంచ టాప్ 800 జాబితాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది.
ఈ ప్రయాణంలో ఆమె తన మొదటి IM (ఇంటర్నేషనల్ మాస్టర్) నార్మ్‌ను సాధించింది. ప్రస్తుతం 20 ఏళ్ల లోపు అమ్మాయిలలో ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. భారతీయ మహిళా చెస్ ప్లేయర్లలో ఆమె ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది.