2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 664 రన్స్ సాధించింది. ఈ మ్యాచ్‌లో నంబర్ 8 బ్యాటర్ సెంచరీతో చరిత్ర సృష్టించారు.
2007 జూలై-ఆగస్టు నెలల్లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 664 రన్స్ సాధించింది. జట్టు తరపున నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్ చేసిన స్పిన్నర్ అనిల్ కుంబ్లే 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 110 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.
ఈ ఇన్నింగ్స్‌లో ఎం.ఎస్. ధోనీ (92), దినేష్ కార్తీక్ (91), సచిన్ టెండూల్కర్ (82), రాహుల్ ద్రవిడ్ (55) మరియు వి.వి.ఎస్. లక్ష్మణ్ (51) హాఫ్ సెంచరీలను నమోదు చేశారు. టెస్ట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది ఆటగాళ్లు డబుల్ డిజిట్ స్కోర్లు సాధించడం ఇదే మొదటిసారి. ఓవల్ మైదానంలో సెంచరీ చేసిన అత్యంత వయసు పైబడిన ఆసియా ఆటగాడిగా అనిల్ కుంబ్లే నిలిచారు.
భారత్ భారీ స్కోరు చేసినప్పటికీ, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 345 రన్స్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 180/6 వద్ద డిక్లేర్ చేయడంతో, ఇంగ్లాండ్ ముందు 500 రన్స్ లక్ష్యం నిలిచింది. అయితే ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 369 రన్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయ్యింది.