ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను ఇంగ్లీష్ మీడియాకు దూరంగా ఉంచాలని మాజీ పాకిస్తాన్ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. దీనికి బదులుగా షాన్ మసూద్‌ను మీడియా ముందు ఉంచాలని ఆయన కోరారు.
ఆగస్టు 19 నుండి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను ఇంగ్లీష్ మీడియా ముఖాముఖి నుండి దూరంగా ఉంచాలని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ పిసిబికి సూచించారు.
ఇంగ్లీష్ మీడియా తరచుగా పర్యటక బృందాలను అనవసరమైన వార్తల్లోకి లాగుతుందని లతీఫ్ అన్నారు. కాబట్టి, ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉన్న షాన్ మసూద్‌ను మీడియా సమావేశాలకు పంపడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు.