ఆగస్టు 15 నుండి భారత్ మరియు శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టు కోసం శ్రీలంక 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
భారత్ మరియు శ్రీలంక (SL vs IND) మధ్య ఆగస్టు 15 నుండి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ గాలే వేదికగా జరగగా, ఆగస్టు 23 నుండి కొలంబోలో రెండో టెస్టు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక బుధవారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ధనంజయ డి సిల్వా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా, కమిందు మెండిస్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు, టీమ్ ఇండియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణించిన పలువురు యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు.