జిమెయిల్ పాస్‌వర్డ్ మర్చిపోయినా లేదా రికవరీ నంబర్ అందుబాటులో లేకపోయినా ఇక చింతించక్కర్లేదు. గూగుల్ కొత్తగా తీసుకొస్తున్న 'సెల్ఫీ వీడియో వెరిఫికేషన్' ద్వారా మీ ముఖాన్ని ధృవీకరించి ఖాతాను తిరిగి పొందవచ్చు.

वीडियो लोड हो रहा है...

జిమెయిల్ పాస్‌వర్డ్ మర్చిపోయి, దానికి అనుబంధంగా ఉన్న మొబైల్ నంబర్ లేదా రికవరీ ఫోన్ అందుబాటులో లేనప్పుడు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ 'సెల్ఫీ వీడియో' అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ ముఖాన్ని వెరిఫై చేయడం ద్వారా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు సెటప్ సమయంలో ఒక చిన్న వీడియోను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు లేదా సాధారణ పద్ధతుల్లో లాగిన్ అవ్వలేనప్పుడు, గూగుల్ లైవ్ వీడియో రికార్డింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇందులో ముందే రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను ఉపయోగించడం సాధ్యపడదు, కేవలం లైవ్ వీడియో మాత్రమే చెల్లుతుంది.

భద్రత విషయంలో గూగుల్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త వీడియో అథెంటికేషన్ పద్ధతిలో బహుళ భద్రతా పొరలు ఉంటాయి. ఇది కేవలం నిజమైన వీడియోలను మాత్రమే గుర్తిస్తుంది మరియు డీప్‌ఫేక్ (Deepfake) వీడియోలను కూడా సులభంగా గుర్తించగలదు.