జపనీస్ రాక్‌స్టార్ గాక్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో జెనెసిస్ కాస్ ప్లే ఫోటోను పోస్ట్ చేయడంతో, ఫైనల్ ఫాంటసీ అభిమానులు 'డర్జ్ ఆఫ్ సెర్బరస్' రీమేక్ వచ్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు.
జపాన్‌కు చెందిన ప్రముఖ రాక్‌స్టార్ గాక్ట్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ను షేర్ చేశారు. అందులో ఆయన క్రైసిస్ కోర్‌లోని జెనెసిస్ పాత్రలా కనిపిస్తున్నారు. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన 'Redemption' పాట డర్జ్ ఆఫ్ సెర్బరస్ గేమ్ అధికారిక థీమ్ సాంగ్ కావడం వల్ల, విన్సెంట్ వాలెంటైన్ ఆధారిత ఈ గేమ్ రీమేక్ రాబోతోందని అభిమానులు ఊహస్తున్నారు.
గతంలో క్రైసిస్ కోర్ రీమేక్ ప్రకటించకముందు కూడా గాక్ట్ ఇదే తరహాలో హింట్స్ ఇచ్చారు. అంతేకాకుండా, ఫైనల్ ఫాంటసీ VII రెవలేషన్ డైరెక్టర్ నవోకి హమాగుచి అన్ని స్పిన్-ఆఫ్ కథలను ప్రధాన కథతో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల తెలిపారు, ఇది అభిమానుల ఆశలను మరింత పెంచింది.