గూగుల్ తన కొత్త స్క్రీన్ లేని ఫిట్‌నెస్ ట్రాకర్ 'ఫిట్‌బిట్ ఎయిర్' అక్టోబర్‌లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

గూగుల్ మే నెల ప్రారంభంలో తన ఫిట్‌బిట్ ఎయిర్‌ను వెల్లడించింది. ఇది స్క్రీన్ లేని ఫిట్‌నెస్ ట్రాకర్, ప్రస్తుతం మార్కెట్‌లో ఇటువంటి పరికరాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటివరకు అనేక దేశాల్లో ఇది అందుబాటులోకి రాలేదు, భారత్ కూడా అందులో ఒకటి.

అయితే, ఫిట్‌బిట్ ఎయిర్ అక్టోబర్‌లో భారతదేశంలో లాంచ్ కానుందని గూగుల్ తాజాగా స్పష్టం చేసింది. పిక్సెల్ 11 సిరీస్ లాంచ్ సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీని ధర గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు, కానీ అమెరికాలో దీని ధర $99.99 గా ఉంది.