LPG వినియోగదారులు ఆగస్టు 16 గడువులోపు e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో ఇండెన్, హెచ్‌పి లేదా భారత్ గ్యాస్ కనెక్షన్‌లు నిలిపివేయబడవచ్చు.

ఎల్పిజి వినియోగదారులకు కీలక హెచ్చరిక విడుదలైంది. ఆగస్టు 16వ తేదీ లోపు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీ గ్యాస్ కనెక్షన్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ఎస్ఎంఎస్ మరియు సోషల్ మీడియా ద్వారా వినియోగదారులను అలర్ట్ చేస్తున్నాయి.

ఈ ప్రక్రియను వినియోగదారులు ఇంటి నుండే సులభంగా పూర్తి చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ వినియోగదారులు 'ఇండియన్ ఆయిల్ వన్' యాప్ ద్వారా లేదా తమ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. గడువు ముగిశాక సబ్సిడీ ధరలకే సిలిండర్లు లభించకపోవచ్చు.