పసిఫిక్ మహాసముద్రంలో మెక్సికో తీరానికి సమీపంలో ఏర్పడిన 'జెనీవీవ్' తుఫాను తీవ్ర హరికేన్‌గా రూపాంతరం చెందింది. అయితే, దీని వల్ల భూభాగంపై ఎలాంటి ప్రత్యక్ష ముప్పు లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మెక్సికో పశ్చిమ తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'జెనీవీవ్' తుఫాను వేగంగా బలపడి అత్యంత శక్తివంతమైన హరికేన్‌గా మారింది. గాలుల తీవ్రత భారీగా పెరగడంతో దీనిని కేటగిరీ-4 హరికేన్‌గా వర్గీకరించారు. అయితే, ఇది తీరానికి దూరంగా ప్రయాణిస్తుండటంతో భూభాగంపై నేరుగా విరుచుకుపడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
నేషనల్ హరికేన్ సెంటర్ నివేదిక ప్రకారం, ఈ హరికేన్ మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పానికి సమాంతరంగా కదులుతోంది. నేరుగా భూభాగంపై ప్రభావం చూపకపోయినప్పటికీ, దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అలలతో రఫ్ గా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.