జర్మనీలోని బెర్లిన్‌లో క్రిస్టోఫర్ స్ట్రీట్ డే వేడుకల సమయంలో ఒక వాహనం జనసమూహంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

శనివారం సాయంత్రం బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ సమీపంలో క్రిస్టోఫర్ స్ట్రీట్ డే వేడుకల జరుగుతుండగా ఒక వాహనం జనసమూహంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో యూరప్‌లోనే అతిపెద్ద ప్రైడ్ ఈవెంట్‌లలో ఒకటైన ఈ వేడుకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

తీయర్‌గార్టెన్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, నిందితుల కోసం తీవ్రంగా శోధిస్తున్నట్లు తెలిపారు. ఒక తెల్లటి వ్యాన్ వేగంగా గుంపులోకి దూసుకువచ్చిందని, ఆ తర్వాత ఒక వ్యక్తి వాహనం నుండి దిగి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.