రష్యా రాజధాని మాస్కోలోని కుడ్రిన్స్కాయా స్క్వేర్‌లోని ఒక రెస్టారెంట్ సమీపంలో జరిగిన పేలులులో కనీసం ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు.

శనివారం సాయంత్రం మాస్కోలోని కుడ్రిన్స్కాయా స్క్వేర్‌లోని ఒక రెస్టారెంట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 8:10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ పేలుడు కారణంగా ముగ్గురు మరణించారని, 15 మంది వివిధ స్థాయిలలో గాయపడ్డారని మాస్కో పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించారు. పేలుడు రావడానికి గల కారణాలపై అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.

భద్రతా దృష్ట్యా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు మరియు బారికద్నయా మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారాలను కూడా మూసివేశారు.