అమెరికాలోని కెంటుకీలో ఒక పార్కులో జరిగిన కాల్పుల ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, పిల్లలతో సహా నలుగురు గాయపడ్డారు.

అమెరికాలోని కెంటుకీ రాష్ట్రం లెక్సింగ్టన్ డౌన్‌టౌన్‌లోని చార్లెస్ యంగ్ పార్కులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

గాయపడిన నలుగురిలో 4 మరియు 14 సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీస్ చీఫ్ లారెన్స్ వెదర్స్ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.