భర్తకు ముందే వివాహం ఉన్న విషయం తెలియక మోసపోయాన్న మహిళకు భరణం పొందే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాహం చెల్లనిదైనప్పటికీ, మోసపోయిన మహిళ భరణం పొందకుండా అడ్డుకోలేమని జస్టిస్ ప్రసాద్ పేర్కొన్నారు.

భర్తకు ముందే వివాహం ఉన్నట్లు దాచిపెట్టి, మోసం చేసి వివాహం చేసుకున్న మహిళ CrPC సెక్షన్ 125 ప్రకారం భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఒక వివాహం చట్టపరంగా చెల్లనిదైనప్పటికీ, ఆ వివాహం ద్వారా మోసపోయిన మహిళ భరణం కోరే హక్కును కోల్పోదని కోర్టు స్పష్టం చేసింది.