ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ పోలీస్ స్టేషన్‌లో డీజే పాటలకు కానిస్టేబుళ్లు చిందులు వేసిన వీడియో వైరల్‌గా మారింది. 'వతన్ తేరా జల్వా' పాట ప్లే కాగానే వారు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డ్యూటీలో ఉన్న క్రమంలోనే పోలీసులు డీజే పాటలకు లొంగిపోయి డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
'వతన్ తేరా జల్వా' పాట వస్తుండగా కానిస్టేబుళ్లు తమ బాధ్యతలను పక్కన పెట్టి ఆనందంగా స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చనీయాంశమైంది.