మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన 59 ఏళ్ల CRPF జవాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో విధుల్లో ఉన్నారని తెలిసింది.
సిధి జిల్లా మజహోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 14న నిందితుడు కుర్కురే ఇస్తానని నమ్మించి బాలికను పిలిచి అత్యాచారం చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల విచారణలో నిందితుడు జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్నాడని, 20 రోజుల సెలవుపై ఇంటికి వచ్చాడని తేలింది. నిందితుడు వచ్చే ఏడాది రిటైర్ కానున్నాడు. పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని కోర్టు ద్వారా జిల్లా జైలుకు తరలించారు.