బాలీవుడ్ నటుడు గోవిందా తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణి స్వర్ణకార్‌తో కలిసి కనిపించడంపై ఆయన భార్య సునీతా అహుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందాకు బుద్ధి భ్రష్టమయిందని ఆమె మండిపడ్డారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణి స్వర్ణకార్‌తో కలిసి కనిపించిన వార్తలు సోషల్ mediaలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై గోవిందా భార్య సునీతా అహుజా తీవ్రంగా స్పందించారు. తన భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సునీతా అహుజా మాట్లాడుతూ.. 'వినాశకాలే విపరీత బుద్ధి' అంటూ గోవిందాపై మండిపడ్డారు. ఆయనకు బుద్ధి భ్రష్టమయిందని, ఇలాంటి తక్కువ స్థాయి పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత వ్యవహారాలను గుర్తు చేస్తూ, ఆయన ఎటో ఒకటో పోతే తనకేం సంబంధం లేదన్నట్లుగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.