నటుడు గోవింద మరియు నటి కోమల్ రాణిల మధ్య సంబంధాల పుకార్లపై ఆయన భార్య సునీత ఆహుజా తీవ్రంగా స్పందించారు.
బాలీవుడ్ స్టార్ గోవింద వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటి కోమల్ రాణితో గోవింద సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన భార్య సునీత ఆహుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవింద విచక్షణ కోల్పోయారని ఆమె విమర్శించారు.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కోమల్ రాణిని కొత్త రాఖీ సావంత్ అని పోలుకుంటున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.