అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై కొత్తగా వివాదం మొదలైంది. వైట్ హౌస్ విడుదల చేసిన ఆరోగ్య నివేదికల పట్ల కార్డియాలజిస్ట్ డాక్టర్ జోనాతన్ రీనర్ అనుమానాలను వ్యక్తం చేశారు.

80 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉందని వైట్ హౌస్ వైద్యులు చెబుతున్నప్పటికీ, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జోనాతన్ రీనర్ మాత్రం సమాచారంలో పారదర్శకత లేదని విమర్శించారు. ట్రంప్ చేతుల్లో మచ్చలు, కాళ్ల వాపు మరియు పగటిపూట నిద్రమత్తు వంటి అంశాలను రీనర్ ప్రస్తావించారు.

ట్రంప్‌కు 'క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ' ఉన్నట్లు వైట్ హౌస్ గతంలో తెలిపింది. అయితే, ఒక ఆరోగ్య పరీక్ష కోసం 22 మంది నిపుణులు ఎందుకు అవసరమయ్యారు? మరియు కొన్ని మందుల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు? వంటి ప్రశ్నలను రీనర్ లేవనెత్తారు. ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.