గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఆగస్టు 15 నుండి దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనున్న కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP). ఈ మేరకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజేత్ దీపకే ప్రకటించారు.

దేశంలోని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం మరియు విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం లక్ష్యంగా కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆగస్టు 15వ తేదీ నుండి దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించనుంది. విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పించడమే ఈ ప్రచార ప్రధాన ఉద్దేశం.

మహారాష్ట్రలోని హింగోలి గ్రామం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని అభిజేత్ దీపకే తెలిపారు. గ్రామ సర్పంచులను ప్రోత్సహించడానికి 'సర్పంచ్ ఛాలెంజ్' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలను అభివృద్ధి చేసిన సర్పంచులకు సోషల్ మీడియా ద్వారా గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే, పాఠశాలల్లోని సౌకర్యాల పట్ల తల్లిదండ్రులు సామాజిక ఆడిట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.